Nara Lokesh : ఏపీకి కాగ్నిజెంట్ నుంచి త్వరలో గుడ్ న్యూస్
కాగ్నిజెంట్ సంస్థ నుంచి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ అందుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు
కాగ్నిజెంట్ సంస్థ నుంచి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ అందుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్ లో మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తో సమావేశమయ్యారు. త్వరలోనే మంచి వార్త కాగ్నిజెంట్ నుంచి అందుతుందని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపలతో కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని, 2.2 మిలియన్ చదరపు అడుగుల స్సేస్ ఉందని తెలిపారు.
విస్తరణ కార్యకలాపాలను...
విశాఖపట్నం నుంచి కాగ్నిజెంట్ టైర్ 2 విస్తరణ కార్యకలాపాలను ప్రారంభించాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీలో ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా మారాని కాగ్నిజెంట్ ను లోకేష్ కోరారు. ఇందుకు కాగ్నిజెంట్ సీఈవో నుంచి సుముఖత వ్యక్తమయినట్లు తెలిసింది. త్వరలోనే ఏపీలో విస్తరణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.