Nara Lokesh : మహానాడుకు ముందే లోకేశ్ ముందడుగు.. ఇక ఆపేదెవరు?
మహానాడులో మంత్రి నారాలోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించబోతున్నారు.
మహానాడులో మంత్రి నారాలోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించబోతున్నారు. కార్యకర్తలకు నిరంతరం నారా లోకేశ్ అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు అండగా నిలబడటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. నారా లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాలకు రాకముందు నుంచే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి నారా లోకేశ్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన టీం కూడా పార్టీలో మఖ్య భూమిక పోషిస్తుంది. కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వెంటనే వారికి ఆర్థిక సాయం అందేలా వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ వస్తున్నారు. నారా లోకేశ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి కార్యకర్తల మనిషిగానే ఆయన గుర్తింపు పొందారు.
కార్యకర్తలకు ప్రాధాన్యత...
మహానాడులో పార్టీలో ముఖ్యమైన పదవిని అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. నారా లోకేశ్ ఎక్కడకు వెళ్లినా కార్యకర్తలతో సమావేశం కాకుండా ఉండరు. నేతలకు కూడా ఆయన పదే పదే చెబుతారు. కార్యకర్తలు పార్టీకి పిల్లర్ల లాంటి వారని వారిని విస్మరిస్తే కూసాలు కదలిపోతాయని లీడర్లను హెచ్చరిస్తుంటారు. తాను స్వయంగా కార్యకర్తలకు అండగా నిలుస్తూనే నారా లోకేశ్ లీడర్లను కూడా అటు వైపు తిప్పుతున్నారు. తాజాగా నారా లోకేశ్ కార్యకర్తలకు కూడా కొన్ని సూచనలు చేశారు. కార్యకర్తలు గ్రామంలో కలసి ఉండాలని కోరారు. గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోవాలని తెలిపారు. అప్పటికి కాకపోతే ఎమ్మెల్యే వద్దకు వెళ్లమని తెలిపారు.
ఎవరూ రెస్పాండ్ కాకుంటే...
ఎమ్మెల్యే కూడా సరిగా స్పందించకపోతే వెంటనే మీ జిల్లా మంత్రిని కలవాలని సూచించారు. ఇన్ ఛార్జి మంత్రి కూడా రెస్పాండ్ కాకపోతే సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వాలని వెంటనే పరిష్కారం అయ్యేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మనం ఇంట్లో కూర్చుని పనులు కావాలంటే కావని, మీ సొంత పనులు అడగాలని, మీకు సమస్యలు లేకపోతే అప్పుడు మిగిలిన రి పనులు తీసుకురావాలని సూచించారు. అంటే మన సొంత పనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నారా లోకేశ్ సూచించడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కలిగిందనే చెప్పాలి.
నిరుత్సాహపడవద్దంటూ...
ఎక్కడా నిరుత్సాహ పడవద్దంటూ వారికి హామీ ఇచ్చారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దని కూడా నారా లోకేశ్ సెంటిమెంట్ తో కొట్టేలా కార్యకర్తలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దంటూ మీరు లైవ్ లో విన్నవి నమ్మాలని కూడా చెప్పారు. మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి పనులు చేస్తున్నాడని మూడో వ్యక్తి చెప్పిన మాటలను నమ్మవద్దని, వాటిని తెలుసుకుని నిజానిజాలు పరిశీలించాలని తెలిపార. లోకేష్ టైమ్ ఇవ్వడం లేదని, చంద్రబాబు అసలు కలవడం లేదుఅనే వదంతులు నమ్మవద్దని, తామూ మనుషులమేనని, కొన్ని తప్పులు చేస్తామని, వాటిని సరిదిద్దుకునేందుకు తమకు సమయం ఇవ్వడమే కాకుండా సహకరించాలని కూడా నారా లోకేశ్ అన్నారు.