రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేష‌న్ దుకాణాల ద్వారా స‌రుకుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

Update: 2025-05-31 12:16 GMT

రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండ‌గ వాతావ‌ర‌ణంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేష‌న్ దుకాణాల ద్వారా స‌రుకుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జూన్ ఒకటో తేదీ పిఠాపురం నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. కూటమి ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు జూన్ 1 నుంచి డీల‌ర్లు రేష‌న్ దుకాణాల ద్వారా నిత్యావ‌స‌రాలు పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

దివ్యాంగులకు, వృద్ధులకు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు ఇంటివ‌ద్దే రేష‌న్ స‌రుకులు పంపిణీ చేయాలని, ఒక‌టో తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఆదివారాల్లో సైతం స‌రుకులు పంపిణీ చేయాలని నాదెండ్ల కోరారు. ప్రతి రేషన్ దుకాణాల వద్ద విధిగా ధ‌ర‌లు, స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాటుచేయాలని, కార్డుదారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌రుకులు పంపిణీ చేయాలనిరాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివ‌ర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశించారు


Tags:    

Similar News