ఆరు రోజుల్లో అరవై ఐదు లక్షల మంది ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి ఊహించని స్పందన వస్తుందని మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి ఊహించని స్పందన వస్తుందని మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆరు రోజుల్లోనే 65 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఉచిత బస్సు సేవలను మహిళలు అత్యధికంగా వినియోగించుకున్నారని మంత్రి తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలను చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నామన్న మంత్రి, రానున్న కాలంలో స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
తిరుమలకు కూడా...
స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అయితే తిరుమలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని త్వరలోనే సానుకూల ప్రకటనను చెబుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు కూడా ఉచిత బస్సు సమస్యగా మారిందని, దీనిపై కూడా త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.