ఏపీలో పింఛన్ తొలగింపుపై మంత్రి క్లారిటీ.. ఎంతమందిని తొలగించామంటే?
లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్లపై సర్వే కూడా పకడ్బందీగా జరుగుతోందనిఆయన వివరించారు. గత ప్రభుత్వంలో అనేక మంది అనర్హులు పింఛన్లు అందుకుంటున్నట్లు తమకుపెద్దయెత్తున ఫిర్యాదులు అందాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
సొమ్ము దుర్వినియోగం కాకుండా...
ప్రజాసొమ్ముదుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ ప్రభుత్వం పెన్షన్లపై సర్వే చేస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అర్హులైన వారందరికీ పింఛన్లను అందచేస్తామనిచెప్పారు. సంఖ్యతో సంబంధం లేదని, ఎంత మంది అర్హులున్నాఅందరికీ ఇస్తామని తెలిపారు. అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పుదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటి వరకూ పథ్నాలుగు వేల మందిని మాత్రమే తొలగించామని తెలిపారు.