జూనియర్ ఎన్టీఆర్ ను కలవొద్దంది నిజం కాదా?

జూనియర్ ఎన్టీఆర్ ను కలవవద్దంటూ చంద్రబాబు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారని మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు

Update: 2022-09-25 07:45 GMT

నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కలవవద్దంటూ చంద్రబాబు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కావాలని టీడీపీలో అందరూ కోరుకుంటున్నారని కాకాని తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టిందెవరు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఎంత అన్నది అందరికీ తెలుసునని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబు అని ఆయన అన్నారు. పసుపు పచ్చ జెండాలు తీసి ఆకుపచ్చ జెండాలు పెట్టించారన్నారు. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడమే చంద్రబాబు ప్రయత్నమని కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు.

గుడివాడలో తొడలు కొట్టించి....
కుప్పం లో జగన్ సభకు జనం వచ్చారని, గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా చంద్రబాబు మహిళల చేత తొడకొట్టించారన్నారు. గుడివాడను అభివృద్ధి చేయబట్టే కొడాలి నాని అక్కడ ప్రజలు మూడు సార్లు గెలిపించారన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కళాశాలలు తెచ్చారన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలుగా తీర్చిదిద్దారన్నారు. ఆరోగ్య శ్రీ పేరు మార్చలేదా? అని కాకాని ప్రశ్నించారు. ఎన్ని రకాల వైద్య సేవలను అందులో నుంచి తగ్గించావని చంద్రబాబును కాకాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఫొటో ను ఈరోజు టీడీపీ సభ్యత్వం నమోదు చేసే పుస్తకాల్లో కూడా లేకపోవడం నిజం కాదా? అని నిలదీశారు


Tags:    

Similar News