వాలంటీర్లపై ఫుల్లు క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పూర్తి క్లారిటీ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పూర్తి క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ల గురించి చాలాసార్లు సభలో మాట్లాడామన్న మంత్రి 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్లను గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో లేనివాళ్లతో పనిచేయించుకున్నారని, అందులో కొందరి చేత రాజీనామాలు చేయించారని మంత్రి అన్నారు.
తిరిగి తీసుకునే విషయంపై...
వాలంటీర్ల ను తిరిగి తీసుకునే విషయంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా పింఛన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గుర్తు చేశారు. గతత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ నిధులను విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.