Anam : కాశినాయన ఆశ్రమంపై మంత్రి రెస్పాన్స్ ఏందంటే?
కడప జిల్లాలోని కాశినాయన ఆశ్రమంలో అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అన్నారు
కడప జిల్లాలోని కాశినాయన ఆశ్రమంలో అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అన్నారు. టైగర్ జోన్ గా మారడంతో అక్కడ నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. రాను రాను ఆశ్రమంలోకి వెళ్లాలన్నా అటవీ శాఖ అధికారుల అనుమతి కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
దేవాదాయ శాఖ పరిధిలోకి...
కాశినాయన ఆశ్రమం ప్రసిద్ధి గాంచిందని, నిత్యం అన్నదానం జరుగుతుందని, లక్ష మందికి పైగా రోజూ అన్నదానం చేస్తారని అన్నారు. దీనిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలన్న సభ్యుల ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని తెలిపారు. లోకేశ్ కూడా క్షమించమని కోరారని, పునర్నించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు.