నెల్లూరులో భూ కంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
భూ ప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా.. భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి..
earthquake in nellore
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. సోమవారం చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో మూడు సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుండి బయటికి పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా.. భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కానీ.. ప్రజలు మాత్రం భయంతో చాలా సేపు ఇళ్లబయటే ఉండిపోయారు. కాగా.. ఇటీవల కాలంలో ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.