Weather Report : మళ్లీ ఎండలు బాబోయ్.. రోహిణీ కార్తె ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది.

Update: 2025-06-06 02:24 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. అయితే ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగానే నమోదయ్యే అవకాశాలున్నాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అఅవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పగలంతా ఎండలు.. ఉదయం నాలుగు గంటల నుంచి చలిగాలులు, తర్వాత ఉక్కపోత ఇలాంటి భిన్నమైన వాతావరణం నెలకొనే అవకాశముందని తెలిపింది. రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించినప్పటికీ అవి మందగిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపంది. దీంతో పాటు ప్రస్తుతం రోహిణీ కార్తె నడుస్తుండటంతో ఎండల వేడి కూడా ఎక్కువగా ఉంది. అకాల వర్షాలతో మొన్నటి వరకూ చల్లటి వాతావరణం కొనసాగినా మళ్లీ ఎండలు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత మరింతగా పెరిగింది.

నలభై డిగ్రీల వరకూ...
తెలుగు రాష్ట్రాల్లో నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీంతో కొన్ని రోజుల పాటు రోహిణి కార్తె ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ కేంద్రంత ెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగి నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెల్లవారు జాము నుంచి చలిగాలులు వీస్తాయని చెప్పింది. రోహిణి కార్తె ఇంకా కొనసాగుతుండటంతో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వర్షాలు అక్కడక్కడ ఏపీలో కురిసే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రత పెరిగింది. నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి వరకూ అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. పంట నష్టం కలిగించింది. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడు రోహిణీ కార్తె ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈరోజు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్సాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు ముఫ్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. అలాగే రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. దీంతో ఏసీలు, విద్యుత్తు వాడకం ఒక్కసారిగా పెరిగింది.


Tags:    

Similar News