Rail Alert : మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ శఆఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది

Update: 2025-08-25 03:48 GMT

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ శఆఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడకక్కడ మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ఉత్తరాంధ్రలోని తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది.
బలమైన ఈదురుగాలులు...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అదే సమయంలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు వాన ముంచెత్తే అవకాశముందన్న వాతావరణ శాఖ చేసిన సూచనతో అలెర్ట్ గా ఉండాల్సిందేనంటున్నారు.


Tags:    

Similar News