Weather Report : రోహిణి ముప్పు ఈ ఏడాది లేనట్లే.. లేటెస్ట్ వెదర్ అప్ డేట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిచింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిచింది. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు గతంలో కంటే వారం నుంచి పది రోజులు ముందుగానే ప్రవేశిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వేడిగాలుల తీవ్రత కూడా తగ్గిందని అంటున్నారు.
విద్యుత్తు వినియోగం తగ్గి...
ఇప్పటికే ఏసీల వాడకం గత రెండు రోజుల నుంచి తగ్గింది. భారీ వర్షాలు చల్లటి వాతావరణంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కోస్తాంధ్రలో, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది.
రెండు రోజులు వర్షాలు...
ఇక వాయుగుండం ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కామారాెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. అదే సమయంలో గంటలకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సమయంలో చెట్లు, హోర్డింగ్ ల కింద ఉండవద్దని హెచ్చరించింది. మరోవైపు ఈసారి రోహిణి నుంచి తప్పించుకుంటున్నట్లేనని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. నేటి నుంచి రోహిణీ కార్తె మొదలయింది. అయినా వర్షాలు పడే అవకాశముంది.