Weather Report : వానలు వదల్లేదట.. వాతావరణ శాఖ లేటెస్ట్ గా ఏం చెబుతుందంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్ ఘఢ్ పరిసర ప్రాంతాంలో్ అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వ్యాపించిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య ప్రదేశ్ మీద నుంచి వాయవ్యదిశగా కదిలే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
రానున్న మూడు రోజులు...
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటిచింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అదే సమయంలో నదులు ఉప్పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.