Rain Alert : వర్షం పడుతుంది.. ఈ ప్రాంతాల్లో వారు జాగ్రత్తలు పాటించాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆ ప్రభావంతో వర్షాలు జోరుగా కురుస్తాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయిని పేర్కొంది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కూడా తెలిపింది. ప్రజలు కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలుకొన్ని చోట్ల పడే అవకాశముందని కూడా పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుుతుందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరించింది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీరంలో సముద్ర కెరటాలు ఎగసి పడుతున్నాయి. రెండు రోజుల పాటు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు.
తెలంగాణలోనూ అంతే...
తెలంగాణాలోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కుమరంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.