Weather Report : తెలుగు రాష్ట్రాలను వదలని వర్షాలు.. ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో అక్కడక్కడ భారీ వర్షాలు నేడు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో అక్కడక్కడ భారీ వర్షాలు నేడు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నేడు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. విజయనగరం,మన్యం, ఏలూరు,పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పిడుగులతో కూడిన వర్షం...
పిడుగులు పడతాయని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వద్ద నిలబడ వద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శ్రీలంకను తాకిన నైరుతి రుతుపవనాలు టచ్ చేశాయి. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదలడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులున్నాయని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది.
తెలంగాణలో రెండు రోజులు...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబద్ వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా భారీ వర్షం నమోదయిన ప్రాంతాల్లో అలెర్ట్ గా ఉండాలని సూచించింది.