నేటి నుంచి ఐదు రోజులు మండనున్న ఎండలు

నేటి నుంచి ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2023-04-09 02:49 GMT

నేటి నుంచి ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఉదయం పది గంటల తర్వాత బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ ప్రాంతాల్లో...
ముఖ్యంగా పార్వతీపురం, శ్రీకాకుళం, అనకాపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, విజయనగరం ప్రాంతాల్లో ఐదు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం నగరంలో 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ లోని మిగిలిన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 42 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.


Tags:    

Similar News