Weather Report : మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని అందుకే రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా ఈరోజు పద్దెనిమిది జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఈరోజు మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందనితెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.