వారం రోజులు వర్షాలేనట

వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-08-29 06:10 GMT

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

తెలంగాణలో ఈ జిల్లాల్లో...
తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి..మహబూబాబాద్, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచించింది. తెలంగాణలో 20 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ అయింది.


Tags:    

Similar News