Weather Report : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఎక్కడెక్కడంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-09-17 03:52 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిన కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని, దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో నైరుతి గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో మోస్తరు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో మూడు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో నేడు...
తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిజిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు తెలంగాణలోనేి కామారెడ్డి,మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News