Rain Alert : నేడు కూడా వర్షాలు.. ఇప్పటికే నిండిన ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో పాటు ఉపరిత ద్రోణి తో ఈ వర్షాలు పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా చెప్పింది.
ప్రాజెక్టులు నిండిపోయి...
మరొకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు గేట్లను తెరిచిన అధికారుల కిందకు దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే పద్దెనిమిదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు జులై నెలలోనే గేట్లు తెరిచారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారాయి. భద్రాచలం, రాజమండ్రి వద్ద గోదావరి నది ఉప్పొంగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలోకి వరద నీరు చేరుతుంది.
తెలంగాణలో మోస్తరు వర్షాలు...
తెలంగాణ రాష్ట్రంలోనూ నేడు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరుగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అయితే తెలంగాణలో వర్షపాతం ఆశించిన దానికన్నా తక్కువ నమోదయిందని కూడా తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే ఏపీలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది.