Rain Alert : ఏం వానలు రా నాయనా.. విసుగుపుట్టిస్తున్నాయ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరికొద్ది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-24 04:33 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరికొద్ది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావవంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు ఈ నెల 25వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా మారనుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా వరస అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో పాటు వాయుగుండంగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో నేడు ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని కూడా వెల్లడించింది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో ఐదు రోజులు...
తెలంగాణలోనూ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం అయితే క్లౌడ్ బరస్ట్ అవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. వాగులు, నదులు పొంగి పొరలుతున్నాయి. రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదులు, వాగులు వద్ద జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవద్దని తెలిపింది. అలాగే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. సాయంత్రం వేళ హైదరాబాదీలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరించింది.


Tags:    

Similar News