Rain Alert : ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వకూ ఉపరితల ద్రోణులు ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ారవర్సలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని, మరొకొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అక్కడక్కడ పిడుగులు పడే...
కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రంత తెలిపింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. కోస్తాంధ్రలో ఎక్కువగా భారీ వర్షాలు పడతాయని, రాయలసీమలో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. వేటకువెళ్లిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం అర్థరాత్రి నుంచి చేపలవేటపై నిషేధం ఎత్తివేయడంతో అనేకమంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు.
ఐదు రోజుల పాటు...
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ఈ నెల 19వ తేదీ వరకూ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈరజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్,కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని కూడా చెప్పింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో భారీ వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.