Rain Alert : నేడు భారీ వర్షాలు...అలెర్ట్ గా ఉండాల్సిందే

ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-09-04 04:31 GMT

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు కుండపోత వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ అధికారుల సూచించారు. సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నందున ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంటుందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింి. ఉత్తరకోస్తా ప్రాంతంలోనూ, దక్షిణ కో్స్తా ప్రాంతంలోనూ భారీవర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా కుండపోత వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు తీరం వెంట యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో నేడు...
తెలంగాణలోనూ నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్తు స్థంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్తు షాక్ తగిలే అవకాశముందని తెలిపింది.


Tags:    

Similar News