Rain Alert : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-06-13 04:24 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పింది. రెండు రోజులు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణలోనూ రెండురోజులపాటు భారీ వర్షాలుపడతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పింది.

ఏపీలో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రెండు రోజుల పాటు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పర్ధానంగా అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, క్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయనితెలిపింది. అతాగే విజయనగరం, మన్యం,పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో ఐదురోజులు...
తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కూడా భారీగానే ఉంటాయని తెలిపింది.


Tags:    

Similar News