Rain Alert : నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలేనట.. హైఅలెర్ట్ అంటున్న వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-02 04:44 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ - వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని కూడా పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ ప్రభావంతో అనేక చోట్ల ఈదురుగాలులు కూడా బలంగా వీస్ాయని కూడా తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఏపీలోనూ భారీ వర్షాలు...
అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
అతి భారీ వర్షాలు తెలంగాణలో...
తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చసింది. అల్పపీడనం నేడు ఏర్పడితే రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, సిద్ధిపేట్, సంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం, కామారెడ్డి, ఆదిలాబాద్, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వరంగల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, హన్మకొండ, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.


Tags:    

Similar News