Weather Report : ఐదు రోజులు భారీ వర్షాలు... అలెర్ట్ గా ఉండాల్సిందేనట

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-06-12 03:56 GMT

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణలో ఉంటాయని చెప్పింది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు తెలంగాణాలో పడతాయని చెప్పడంతో పాటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ఇక జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

పగటి పూట ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, తెలంగాణలో మాత్రం చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలని, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి సమయాల్లో అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
బలమైన ఈదురుగాలులతో...
బలమైన ఈదురుగాలులతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులు పొలాలకు వెళ్లినప్పుడు చెట్లకింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉక్కపోతతో పాటు నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా వాతావరణ కేంద్రంతెలిపింది. నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News