Rain Alert : నాలుగు రోజులు అలెర్ట్ గా ఉండాల్సిందే.. పిడుగులుతో కూడిన భారీ వర్షాలు తప్పవ్

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-05-22 04:13 GMT

పశ్చిమమధ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనిపైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ఏర్పడిందని తెలిపింది.దీని ప్రభావంతో నేడు మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.

పిడుగులు పడతాయని...
అత్యవసర సహాయం,సమాచారం కొరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని కోరింది. పిడుగులు పడే అవకాశమున్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని చెప్పింది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, కర్నూలు, వైఎస్సార్ తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని చెప్పింది.
నాలుగు రోజులు వర్షాలు...
ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జయశంకర్, పెద్దపల్లి, కరీంనగర్ లలో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఇక తేలికపాటి వర్షాలు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఆదివారం వరకూ భారీ వర్షాలుతప్పవని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.
Tags:    

Similar News