Rain Alert : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల ముప్పు తప్పదట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు అల్పపీడనం ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావముందని కూడా చెప్పింది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు కొన్ని చోట్ల ఏపీలో పిడుగులు పడతాయని కూడా తెలిపింది. ఇక ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, దిగువకు నీటిని విడుదల చేయడంతో అధికారులు కూడా అలెర్ట్ చేసింది.
బలమైన ఈదురు గాలులు...
ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణ కోస్తా లోనూ ఒకటి నుంచి రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయనితెలిపింది. రాయలసీమ ప్రాంతంలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. కొన్ని జిల్లాల కలెక్టర్లకు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్...
అయితే తెలంగాణలో కూడా అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కూడా అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా అధికారులు ప్రజలను కోరారు.