Cyclone Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-05-28 03:58 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. రుతుపవనాలు రాకతో పాటు అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు అనేక చోట్ల పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తరాంధ్రతో పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.

పిడుగులతో కూడిన...
రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయనితెలిపింది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశముందని, చెట్లు, హోర్డింగ్ ల కింద నిల్చోవద్దని సూచించింది
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈరోజు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News