Rail Alert : మరో వారం రోజులు భారీ వర్షాలు..అలెర్ట్ గా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-07-03 04:24 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి జల్లలు పడతాయని, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం పడుతుందని, ప్రధానంగా ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని కూడా చెప్పింది. కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని చెప్పింది.
చలిగాలుల తీవ్రత...
తెలంగాణలోనూ వారం రోజుల పాటు వర్షాలుపడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ వర్షాలు ఖరీఫ్ సీజన్ కు మంచి చేస్తామని, రైతులకు తీపి కబురు అని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో జోరు వర్షం పడుతూనే ఉంది.


Tags:    

Similar News