Rain Alert : వదలని వానలు.. మరో అల్పపీడనం.. వర్షంతో తడవాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-28 04:11 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. దక్షిణ ఒడిశా మీదుగా వాయుగుండం నుంచి తెలంగణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా గోవా వరకూ ద్రోణి విస్తరించి ుందని తెలిపింది. ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈ నెల 30వ తేదీనమరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఈ ప్రభావంతో మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

మరో మూడు రోజులు...
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట్, వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలో ఐదు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఐదురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. ఎవరూ వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కోరింది. విద్యుత్తు స్థంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News