Weather Report : ఎండల ముప్పు తప్పినట్లే... ఇక వర్షం ప్రమాదం మాత్రం పొంచి ఉందట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-06-01 03:52 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతోనూ, రుతుపవనాల రాకతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వారం రోజులు వర్షాలు పడతాయని, అయిత మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ ఏడాది మే నెల నుంచి అకాల వర్షాలు ప్రారంభం కావడంతో భారీ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు చాలా ఉపశమనం పొందారు. రోహిణి కార్తెలో వర్షాలు కురవడంతో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు నుంచి తప్పించుకుని ప్రజలు రిలీఫ్ ఫీలయ్యారు.

చేపల వేటకు వెళ్లొద్దంటూ...
వచ్చే మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈరోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని, రాయలసీమ ప్రాంతంలో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా వరకూ తగ్గుతాయని, అయితే ఉక్కపోత మాత్రం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు ఈరోజు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
తెలంగాణాలోనూ మూడు రోజులు...
తెలంగాణలోనూ అదే మాదిరిగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ రంగారెడ్డిలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడావాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది.
Tags:    

Similar News