Rain Alert : ఆరెంజ్ అలెర్ట్.. ఈ జిల్లా వాసులకు కంటి మీద కునుకు ఉండదట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-26 05:09 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ఈ నెల 27వ తేదీనాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటమే కాకుండా పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీలో ఇక్కడ ఆరెంజ్ అలెర్ట్...
వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నెల 26, 27 తేదీల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆంధ్ర్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణం శఆఖ వెల్లడించింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
తెలంగాణలో నేడు రేపు కూడా...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని, ఈ ప్రభావం కారణంగా తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్,నిర్మల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, మేడ్చల్ మల్కాజ్ గిరి,హైదరాబాద్,రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట,జనగాం, హన్మకొండ, సూర్యాపేట, నల్లగొండ,ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News