Rain Alert : జులైలో దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ వెల్లడి

ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-07-02 04:18 GMT

ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు బంగాళాఖాతం, అరేబియా మహసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జులై నెలలో వర్షాలు దంచి కొడతాయని, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

బలమైన ఈదురుగాలులు...
గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు విశాఖ వాతవరణ కేంద్రం రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
తెలంగాణలో 19 జిల్లాల్లో...
తెలంగాణలోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పందొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.ఉరుముులు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా తెలిపింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతవావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Tags:    

Similar News