Rain Alert : హై అలెర్ట్... భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్నిరోజులో తెలుసా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో కుండపోత వాన పడే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను అలెర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కుండ పోత వర్షాలు పడతాయని, దాదాపు పదిహేడు జిల్లాలకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలోని పదిహేడు జిల్లాల్లో...
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే కడప, తిరుపతి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. ప్రధానంగా ఈ పదిహేడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఐదు రోజులు...
ఈరోజు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతే అవకాశముందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోనే భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్గ్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో గ్రేటర్ మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.