Rain Alert : ఈరోజు వాన తప్పదు... అలెర్ట్ గా ఉండాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరొకవైపు మరో నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ నెల 13వ తేదీనాటికి ఏర్పడే అవకాశముందని చెప్పింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఏపీలో వర్షాలు పడే ఛాన్స్...
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో నేడు...
తెలంగాణలోనూ నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.