Andhra Pradesh : ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ లో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం,అల్లూరి, తూ.గో., ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు...
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారర.