Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ జారీ చేసింది.

Update: 2025-07-04 04:03 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ జారీ చేసింది. ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు ఈ జిల్లాల్లో...
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిన మేరకు వానలు కురుస్తున్నాయి.
రెండు రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News