Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్...ఇక వర్షాలు కుమ్మేస్తాయట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది

Update: 2025-08-04 03:49 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున దాని ప్రభావంతో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడతాయని పేర్కొంది. ఆగస్టు రెండో వారం నుంచి మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అప్పటి వరకూ తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయని తెలిపింది

వానలు లేకపోవడంతో...
ప్రస్తుతం వానలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. ఉక్కపోత కూడా పెరిగింది. పగటి పూట పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయి. మళ్లీ సాయంత్రానికి కొద్దిగా చల్లబడినట్లు కనిపించినా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని వాతావరణ వాఖ చెప్పింది. వానలు లేకపోవడంతో ప్రాజెక్టుల వద్ద ఎత్తిన గేట్లను కూడా తిరిగి మూసేశారు. నాగార్జున సాగర్ కు ఆదివారం పర్యాటకుల పోటెత్తారు. కానీ గేట్లను అన్నింటినీ మూసివేశారు. ప్రాజెక్టులో నీరు నిల్వ పెరగకపోవడంతో దిగువకు విడుదల చేయడాన్ని నిలిపేశారు.
ఆగస్టు 5వ తేదీ నుంచి...
మరొకవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వానలు మొహం చాటేశాయి. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రాజెక్టులు నిండి నీరు విడుదల చేస్తారని భావించినా ఇప్పుడు అవి కూడా తగ్గుముఖం పట్టడంతో సాగుకు ఇబ్బందులు అయ్యే అవకాశముందని అంటున్నారు. కానీ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, అప్పుడు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 5 తర్వాత నుంచి మోస్తరు వర్షాలు, రెండో వారం నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News