Andhra Pradesh : ఏపీ వాసులకు కూల్ న్యూస్ .. గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటివార్త చెప్పింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉందని తెలిపింది.

Update: 2024-05-07 04:41 GMT

rains in ap and telangana

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటివార్త చెప్పింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉందని తెలిపింది. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్ర ప్రదేశ్ వాసులకు కూల్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

అక్కడక్కడా వర్షాలతో పాటు...
ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక‌ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,విజయనగరం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News