Rain Alert : నేడు కూడా అతి భారీ వర్షాలు...ఈ జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాల్సిందే

నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2025-08-15 04:14 GMT

నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరొకవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్ని గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలెర్ట్ చేస్తున్నారు.

తెలంగాణలో నేడు...

తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలెర్ట్, సూర్యాపేట్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ప్రయాణాలను కూడా అవసరమైతే తప్ప చేయాలని, లేకుంటే వాయిదాలు వేసుకోవడం మంచిదని వాతావరణ కేంద్రం సూచించింది. అల్పపీడనం ప్రభావంతోనే ఈ భారీ వర్షం పడుతుందని తెలిపింది.
ఏపీలో ఇక్కడ...
వాయవ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న ల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని తెలిపింది. దీని ప్రభావంతో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, , అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.


Tags:    

Similar News