Ditva Cyclone : ఈరోజు రేపు డేంజర్.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి

ఆంధ్రప్రదేశ్ లోనూ దిత్వా తుపాను ఎఫెక్ట్ బలంగా చూపుతుందని వాతావరణ శాఖ చెబుతుంది.

Update: 2025-11-30 06:12 GMT

నైరుతి బంగాళాఖాతం 'దిత్వా' తుపాను రాబోయే 24 గంటలు ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోతల వానలు మొదలయ్యాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ దిత్వా తుపాను ఎఫెక్ట్ బలంగా చూపుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తారు. దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

బలమైన గాలులు...
కోస్తాతీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్లండి. అత్యవసర సహాయం కోసం నెల్లూరు, కడప, వెంకటగిరిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.దిత్వా తుఫాను తీరానికి చేరువవుతున్న సమయంలో తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మయిలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతోపాటు పుదుచ్చేరిలోని కారైకల్ ప్రాంతంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే గాలులతో కూడిన వర్షం మొదలయింది.
జాతీయ రహదారులపై ప్రయాణం...
అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించింది. అదనంగా మరో 3 బృందాలు సిద్ధంగా ఉంచారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాట చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని, అలాగే ఈ జిల్లాల మీదుగా జాతీయ రహదారులపై వెళ్లే వారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కోస్తా తీరంలో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించింది. ఈరోజు, రేపు డేంజర్ అని చెప్పింది.


Tags:    

Similar News