Cyclone Alert : ఏపీలో ఈ జిల్లాలకు హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలను వాతావరణ శాఖ హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా రూపాంతరం చెందనుందని పేర్కొంది. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని, ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భారీవర్షాలు...
ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపానుగా ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని శాఖల అధికారులను అలెర్ట్ చేశారు. మూడు రోజుల పాటు రెవెన్యూ, పోలీసులకు సెలవులు రద్దుచేశారు. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది.