Rain Alert : ప్రయాణాలు మానుకోండి.. ఉద్యోగులూ వర్క్ ఫ్రం చేసుకోండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Update: 2025-07-23 03:06 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఉపతితల ఆవర్తన ప్రభావంతో పాటు రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

ఆరెంజ్ అలెర్ట్ జారీ...
తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం ఇస్తే మేలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో పాటు, ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించారు. ఈరోజు భధ్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చసింది. అలాగే మహబూబాబాద్, వికారాబాద్, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.
ఈ జిల్లాలో భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. పశువుల కాపర్లు, రైతుల చెట్లకింద నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మిగిలిన జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా తెలిపింది.


Tags:    

Similar News