Rain Alert : వర్షాలు ఇప్పట్లో ఆగేవి కావట.. వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు నేడు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది

Update: 2025-08-20 04:36 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు నేడు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలోల భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు భారీ వర్షాల కారణంగా వేటకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీచేశారు. తీరం వెంట గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. బయటకు వస్తే భారీ వర్షాల్లో చిక్కుకుపోతామని భయపడి చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

మరో వారం రోజులు వర్షాలే...
ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింద.ి అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, విద్యుత్తు స్థంభాలు, చెట్ల కింద ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. అనేక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. గోదావరి నదికి వరద నీరు పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


Tags:    

Similar News