Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌కు చిరు పుట్టిన రోజు శుభాకాంక్షలు

పవన్‌ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి తెలిపారు.

Update: 2025-09-02 04:37 GMT

పవన్‌ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి తెలిపారు. దీర్ఘాయుష్మాన్‌ భవ అంటూ తమ్ముడు పవన్‌ను దీవించిన చిరంజీవి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా ఎదిగారని చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్నారని అన్నారు.

దీర్ఘాయుష్మాన్‌ భవ అంటూ...
ప్రజా సేవలో పవన్‌ చూపుతున్న అంకితభావం చిరస్మరణీయమన్న చిరంజీవి ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని పవన్‌ను ఆశీర్వదిస్తున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు. కాగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Tags:    

Similar News