నందమూరి బాలకృష్ణ కామెంట్స్ కు చిరంజీబి మాస్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వైఎస్ జగన్ పిలిస్తేనే తాను వెళ్లానని చిరంజీవి తెలిపారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తాను సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను వివరించడానికి వెళ్లానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ అందుబాటులో లేరని....
సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను తాను వివరించానని అన్న చిరంజీవి సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని జగన్ కు తాను చెప్పానని అన్నారు. జగన ను కలవడానికి ముందు తాను బాలకృష్ణకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో లేరని చిరంజీవి అన్నారు. అప్పుడు కరోనా ఉన్నందున ఐదుగురు మాత్రమే రావాలని అన్నారు. తాము పది మంది మాత్రమే వస్తామని చెప్పడంతో జగన్ అంగీకరించారని చిరంజీవి చెప్పారు. తన చొరవ వల్లనే ఏపీలో నాడు సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయన్నారు.