సమ్మెకు సిద్ధం... కార్యాచరణ ఇదీ

ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది. సమ్మెకు ఉద్యోగ సంఘాలు రెడీ అయిపోయాయి. ఇందుకోసం కార్యాచరణను సిద్దం చేశాయి

Update: 2022-01-21 09:10 GMT

ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది. సమ్మెకు ఉద్యోగ సంఘాలు రెడీ అయిపోయాయి. ఇందుకోసం కార్యాచరణను సిద్దం చేశాయి. వచ్చే సోమవారం చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. ఈరోజు చీఫ్ సెక్రటరీని కలిసి తమకు పాత జీతాలే ఇవ్వాలంటూ వినతి పత్రాన్ని సమర్పించనున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు దాదాపు మూడు గంటల పాటు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. దశల వారీ ఆందోళనకు సిద్దమయ్యాయి. పీఆర్సీపై ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకూ పోరాటం చేయాలని నిర్ణయించాయి.

ఆందోళన ఇలా....
ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాయి. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తారు. 26వ తేదీన అన్ని తాలూకు కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పిస్తారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం, 5న సహాయ నిరాకరణ, 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.


Tags:    

Similar News