నేడు జనసేన విస్తృత స్థాయి సమావేశం

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది

Update: 2022-06-04 02:00 GMT

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఇటీవల కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల విషయంపై ఆ ప్రాంతానికి చెందిన నేతల నుంచి మరింత సమాచారాన్ని తీసుకుంటారు. కోనసీమ పర్యటనపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

అనేక అంశాలు...
దీంతో పాటు రైతు భరోసా యాత్రపై కూడా పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు భరోసా కల్పించాలన్న యాత్ర సక్సెస్ కావడంతో దీనిని కొనసాగించాలని నేతలు సయితం భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు.


Tags:    

Similar News