Breaking : సుప్రీంకోర్టులో మార్గదర్శికి షాక్
మార్గదర్శికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది
telangana government, relief, supreme court, mlcs
మార్గదర్శి సంస్థకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. మార్గదర్శి వేసిన పిటీషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నమోదయిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మార్గదర్శి పిటషన్ వేసింది.
ఏపీ హైకోర్టుకు వెళ్లమని...
మార్గదర్శి పిటీషన్లను అనుమతించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణపై స్టే కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టునే ఆశ్రయించవచ్చని సూచించింది. కేసును కొట్టివేస్తే పిటీషన్లీ నిరర్ధరకమయినట్లే కాదా? అని కామెంట్స్ చేసింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే పిటీషన్ వేయాలని తెలిపింది.